Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాట తప్పడం మడమ తిప్పడంలో జగన్ కు సాటి లేరు

విశాలాంధ్ర- పెనుకొండ : నగర పంచాయతీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ సవితమ్మ కార్యాలయం నందు శనివారం పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట తప్పడంలోనూ మడమ తిప్పడంలోనూ అతనికి సాటి ఎవరూ లేరని ఎన్నికల మునుపు ఇచ్చిన హామీలు గురించి జగన్ ప్రభుత్వం పై ధ్వజమెత్తారు ఆయన పరిపాలనపై చేస్తున్న పనులపై ఆమె ఇరుచుకుపడ్డారు
నాలుగేళ్లలో జగన్ రెడ్డి మద్యం దోపిడీ 41 వేల కోట్లకు చేరిందని గత ఎన్నికల ముందు సంపూర్ణ మద్యపానం అన్న జగన్ రెడ్డి నేడు అక్రమ సంపాదన కోసం మాట తిప్పి మండల తిప్పడం బినామీలతో నాసిరకం మద్యం తయారు చేయించి ప్రజల ధన మన ప్రాణాలను బలి తీసుకుంటున్నాడు.
వైసిపి అధికారంలోకి రాగానే నేషనల్ ఇంటర్నేషనల్ మద్యం బ్రాండ్లను రద్దుచేసి నాసిరకం మద్యం ను తయారు చేసి విక్రయించి వేలకోట్ల దండుకుంటున్నారు.
నాసిరకం మధ్యం లో విష రసాయనాలు ఉన్నట్లు చెన్నైలోనే ూGూ ల్యాబ్ పరీక్షల్లో వెళ్ళడయింది.
గంజాయి స్మగ్లింగ్లో ఏపీ నెంబర్ వన్ అని స్వయంగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గారు డిఆర్ఐ నివేదిక విడుదల చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో కూడా సరఫరా చేస్తున్నారు చివరికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూడా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అంటే వీళ్ళ విచ్చలవిడితనం మనం అర్థం చేసుకోవచ్చు. గంజాయి మత్తులో యువత జీవితాలు నాశనం అవుతున్నాయి వాళ్ళ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంతో ఉన్నారు.జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగం కుదేలైనా గంజాయి సాగులో మాత్రం ఏపీ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది,ఒక నేరగాడిగా తానేంటో చూపించాడు జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో మద్యపానం నిషేధం అని చెప్పి గెలిచిన వెంటనే ఆ మేనిఫెస్టోని అబద్ధాల మేనిఫెస్టో గా మార్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దే అంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు ఆమెతోపాటుగా మాధవ నాయుడు మాజీ మండల కన్వీనర్ శ్రీరాములు సూర్యనారాయణ ప్రసాద్, ఆంజనేయులు నరసింహులు, నంజప్ప, త్రివేంద్ర నాయుడు మారుతి, సుబ్రహ్మణ్యం,వాసుదేవరెడ్డి ,మంజు,మరియు ఇతరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img