Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మాతాశిశు మరణాలు తగ్గించాలి : డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బాయి

విశాలాంధ్ర-రాప్తాడు : మాత శిశు మరణాలు తగ్గించడం కోసం పూర్తి స్థాయిలో నియంత్రణ చర్యలు చేపట్టాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వీరబ్బాయి అన్నారు. మంగళవారం రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఐఓ డాక్టర్ యుగంధర్ తో కలిసి సందర్శించారు. ఆశా డే సమావేశానికి హాజరై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మాత శిశువు మరణాలను నియంత్రించడం కోసం వైద్యాధికారులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గర్భిణుల వివరాలను నమోదు చేసుకునే విధంగా ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. గర్భిణీలకు ప్రతినెల స్కానింగ్, అవసరమైన పరీక్షలను నిర్వహిస్తూ సుఖ ప్రసవం అయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు సిజేరియన్ ప్రసవాలను పూర్తిస్థాయిలో తగ్గించాలన్నారు. గర్భిణుల ఆరోగ్య దృష్ట్యా రక్తహీనత సమస్య లేకుండా అవసరమైన మందులను అందిస్తూ తీసుకోవలసిన పౌష్టికాహారాన్ని సూచించాలని తెలిపారు. ప్రమాదకర గర్భిణులను గుర్తించి సంరక్షణ కోసం ముందుగా ఆసుపత్రికి తరలించాలన్నారు. గర్భిణీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తల్లితోపాటు పుట్టబోయే బిడ్డ సంరక్షణ కోసం జననీ సురక్ష యోజన పథకం కింద రూ. 6000 వేలు ఆర్థిక సహాయం అందుతుందని అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రావణి, సూపర్వైజర్ అరుణ, లక్ష్మినరసమ్మ, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img