Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మా నమ్మకం నువ్వే జగన్‌

ఉప సర్పంచ్ వన్నప్ప

విశాలాంధ్ర  -ఉరవకొండ : మా నమ్మకం నువ్వే జగన్ః కార్యక్రమాన్ని బుధవారం ఉరవకొండ పట్టణంలోని ఐదవ వార్డులో   ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ వన్నప్ప , వైసిపి నాయకులు ఆసిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా   ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకొని  రాష్ట్ర ప్రభుత్వం ముద్రించిన  స్టిక్కర్లు మరియు కిట్లను పంపిణీ చేశారు. జగనన్నే మా భవిష్యత్ః అనే నినాదంతో ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వన్నప్ప తెలిపారు . గత  ప్రభుత్వాలకు- జగన్ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని  కోరారు. నవరత్నాలు పథకాలు ద్వారా అర్హులైన పేదలందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింది అన్నారు. ప్రజలందరూ కూడా  జగన్ ఆశీర్వదించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు తలారి శ్రీనివాసులు,మరియు గృహ సారథులు సచివాలయ కన్వీనర్లు శర్మాస్, అనిల్, వన్నూరు స్వామి, లోకేశ్వరి, వాణి, సంధ్య, భారతి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img