Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మీడియా సోదరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలనీ అధికారులకు వినతి

విశాలాంధ్ర-పెనుకొండ : పేనుకొండ నందు సోమవారం పాత్రికేయులు ఉన్నతాధికారులకు వినతి పత్రాన్ని సమర్పించారు మీడియా సోదరులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వివరిస్తూ జరిగిన సంఘటనపై హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం ఏబీఎన్ ,హెచ్ఎంటీవీ , టివి5 ,మీడియా విధుల నిర్వహణ లో విధులు నిర్వరిస్తుండగా మిడియా సోదరులపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేయడం సిగ్గుచేటు అన్నారు ,ఈ దాడిని ఖండిస్తూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున పాత్రికేయులు అందరూ కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డి ఏ ఓ నాగరాజుకు కు మరియు మరియు డి.ఎస్.పి హుస్సేన్ పీరాకు వినతి పత్రం అందించారు ,మీడియా సోదరులు పైన దాడి చేసిన వారిని ఎంతటి వారినైనా సరే కఠినంగా శిక్షించాలని మీడియా సోదరులు డిమాండ్ చేశారు ,పత్రిక స్వేచ్ఛను తుంగలోకి తొక్కుతున్న వారిని ఎంతటి వారినైనా సరే ప్రజల ముందర వారిని దోషిగా నిలబెట్టి వాళ్ళకి సరైన గుణపాఠం నేర్పుతామని దాడికి పాల్పడినటువంటి వారిని శిక్షపడేలా చూడలని పాత్రికేయులు తెలిపారు ,మీడియా సోదరులు పైన దాడి చేసే వారిని ఎంతటి వారినైనా సరే శిక్ష పడే వరకు మా పోరాటం ఆగదని విడతల వారిగా జర్నలిస్టులందరూ ఒక్కటై నిరసనలు తెలుపుతామన్నారు , ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, ప్రకాష్, ప్రసాద్, ఆదినారాయణ, శివప్రసాద్, మూర్తి, బాబా, మహేష్ తదితరులు రిపోర్టర్లు పాల్గొన్నారు ,

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img