Friday, April 19, 2024
Friday, April 19, 2024

ముగిసిన పెద్దమ్మ తల్లి ఉత్సవాలు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎర్రగుంటలో గల ఎల్సికేపురంలోని శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఉత్సవ ,బోనాల వేడుకలు ఈనెల 17వ తేదీ నుండి 21వ తేదీ వరకు అనగా నాలుగు రోజులు పాటు ఎల్ సి కె పురం ప్రజలు, గ్రామ పెద్దలు, భక్తాదులు, దాతల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4వ రోజు సోమవారం పెద్దమ్మ తల్లికి పూజారి పెద్దన్న దాతలు, భక్తాదులు, పెద్దలు ఇచ్చిన వివిధ పూలను అలంకరిస్తూ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి ప్రత్యేక అలంకరణతో పెద్దమ్మ తల్లి భక్తాదులకు దర్శనమిచ్చారు. ఉరుముల వాయిద్యాలు నడుమ, ప్రజలు తమ భక్తిని చాటుకున్నారు. తదుపరి చివరి రోజు మంగళవారం జ్యోతి బోనాలు వేడుకల్లో భాగంగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం వరకు వందలాదిమంది తల పైన బోనాలు పెట్టుకుని పురవీధుల్లో ఊరేగింపుగా వెళ్లారు. గుడి ఆవరణాన్ని విద్యుత్ దీపాలంకరణ లాంటివి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం పూజారి పెద్దన్న మాట్లాడుతూ ఈ ఉత్సవ బోనాల వేడుకలు నాలుగు రోజులు పాటు అత్యంత వైభవంగా విజయవంతంగా సహకరించిన వారందరికీ పేరుపేరునా వారు కృతజ్ఞతలను తెలిపారు. 13 సంవత్సరాల తర్వాత అమ్మవారిఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహణ పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తాదులు, ఎల్ సి కె పురం ప్రజలు, పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img