Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ముగిసిన రాష్ట్రస్థాయి సెపక్ త క్రా పోటీలు

విశాలాంధ్ర-ఉరవకొండ : రాష్ట్రస్థాయి అండర్ 14 మరియు అండర్ 17 బాల బాలికల సెపక్ తక్రా పోటీలు సోమవారం ముగిశాయి ఉరవకొండ పట్టణంలోని పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఈ పోటీలలో ఉమ్మడి 13 జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. రెండు రోజులుగా జరిగిన ఈ పోటీలు పోటా పోటీగా జరిగాయి.అండర్ 14 బాలురు విభాగంలో రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం కర్నూలు జిల్లా, రెండవ స్థానం నెల్లూరు, మూడో స్థానంలో వెస్ట్ గోదావరి జిల్లాలు గెలుపొందాయి. అలాగే అండర్ 14 బాలికల విభాగంలో ప్రథమ స్థానం వెస్ట్ గోదావరి, రెండవ స్థానం అనంతపురం, మూడవ స్థానంలో కర్నూలు జిల్లా నిలిచింది. అలాగే అండర్ 17 బాలురు విభాగంలో ప్రథమ స్థానం వెస్ట్ గోదావరి, రెండవ స్థానం అనంతపురం మూడు స్థానంలో నెల్లూరు జిల్లా కైవసం చేసుకున్నాయి. అండర్ 17 బాలికల విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి స్థానంలో అనంతపురం, రెండో స్థానంలో వెస్ట్ గోదావరి మూడు స్థానాన్ని నెల్లూరు జిల్లా క్రీడాకారులు కైవసం చేసుకున్నారు. గెలుపొందిన క్రీడాకారులకు ఉరవకొండ సీఐ హరినాథ్ మెమొంటోలు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి సెపక్ తక్రా పోటీలు ఉరవకొండ లోని పోలీస్ క్రీడా మైదానంలో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని స్నేహ సంబంధాలను పెంచుతాయని విద్యతో పాటు క్రీడలలో కూడా విద్యార్థులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీలు ప్రశాంతంగా విజయవంతంగా జరిగాయన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చలపతి, లైన్స్ క్లబ్ అధ్యక్షులు సప్తగిరి మల్లికార్జున,విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు క్రిష్టప్ప,ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన స్కూల్ గేమ్స్ కార్యదర్శి లు రవికుమార్, అంజన్న, రాష్ట్ర పీఈటి అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాగరాజు, సహాయ కార్యదర్శి సిరాజుద్దీన్, జిల్లా కార్యదర్శి మొరార్జీ యాదవ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మారుతి ప్రసాద్, వీరితో పాటు రాష్ట్ర నలుమూలన నుంచి వచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img