Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మున్సిపల్ కార్మికులకు ఫేసియల్ అటెండెన్స్ (ఏపిఎఫ్ ఆర్ ఎస్ ) రద్దు చేయాలి..

ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షుడు రాజేష్ గౌడ్

విశాలాంధ్ర-గుంతకల్లు : మున్సిపల్ కార్మికులకు ఫేసియల్ అటెండెన్స్ తీసివేసి పాత పద్ధతిలోనే అటెండెన్స్ వేయాలని ఏఐఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు, ఏపి మున్సిపల్ వర్కర్స్ యూనియన్(ఏఐటియుసి) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన ఏపిఎఫ్ ఆర్ ఎస్ సిస్టంను మున్సిపల్ పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, కార్మికులు కూడా వారి మొబైల్స్ ద్వారా ప్రతి దినం 4 మార్లు లొకేషన్స్ నందు హాజరు తీసుకోవాలని ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పోరేషన్ ల నందు కమిషనర్లు కార్మికులకు హుకుం జారీ చేస్తున్నారని అన్నారు, నిరక్ష్యరాసులు అయిన స్మార్ట్ ఫోన్ల వాడకం తెలియని మున్సిపల్ కార్మికులు తమ మస్టర్ పడుతుందో లేదో అని భయాందోళనల్లో ఉన్నారన్నారు. పైపెచ్చు ఫీల్డ్ లో పనిచేసే కార్మికులకు ఈ ఫేస్ రీడింగ్ సిస్టం సాధ్యం కాదు. ఇప్పటికే ఇన్స్పెక్టర్ లు,సెక్రెటరీలు కార్మికులపై పర్యవేక్షణ ఉన్నది. ఇది కాదన్నట్లు ఈ ఎఫ్ ఆర్ ఎస్ మూలంగా మస్టర్ పడకపోతే వేతనాలకు గ్యారెంటీ లేని పరిస్థితి నెలకొని వుందన్నారు. అలాగే గత సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల మినిట్స్ ను ఇవ్వాలని,చనిపోయిన, రిటర్మెంట్, అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి పనులు కల్పించాలని, పిఎఫ్ లో నెలకొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.జనవరి 28న మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు.జనవరి 30న కలెక్టర్ కార్యలయం ఎదుట ధర్నాలు.ఫిబ్రవరి 8న మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం ముట్టడి.ఫిబ్రవరి 15న టూల్ డౌన్ సమ్మె జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్ ఏఐటియుసి కార్యదర్శి ఈశ్వరయ్య,మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసయ్య,కొండయ్య,నాగరాజు,చిన్నా,పెంచలయ్య,శ్రీనివాసులు,రవి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img