Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

మృతుడి పేరు వైయస్సార్ బీమా లో నమోదు కాకపోవడంతో మృతదేహంతో రోడ్డెక్కిన బంధువులు

విశాలాంధ్ర -ఉరవకొండ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ బీమా పథకం వర్తించకపోవడంతో సోమవారం ఉరవకొండలో మృతుని బంధువులు మృతదేహంతో రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. ఉరవకొండ పట్టణానికి చెందిన తిమ్మప్ప అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ తన సంసారాన్ని పోషించుకుంటున్నాడు అయితే ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిమ్మప్ప మృతి చెందారు. అయితే ఆయన కుటుంబానికి మంజూరు కావలసిన వైయస్సార్ బీమా పథకం లబ్ధిదారుల జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బంధువులు విలేకరులతో మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా వైయస్సార్ బీమా పథకంలో తిమ్మప్ప పేరును వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా నమోదు చేయలేకపోయారని వారు ఆరోపించారు. దీనివల్ల తమ కుటుంబానికి అందాల్సిన బీమా మొత్తం అందుకుండా పోయిందని కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మృతదేహాన్ని తీసుకెళ్లమని ఎంపీడీవో కార్యాలయం ముందు బైఠాయించారు ఎంపీడీవో నుంచి కూడా సరైన సమాచారం రాకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి ముందు రహదారిలో మృతదేహాన్ని ఉంచి ఆందోళన కొనసాగించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నేలుకున్నాయి. మృతి చెందిన తిమ్మప్ప కు ఇద్దరు ఆడపిల్లలు ఒక బుద్ధి మాంద్యం కొడుకు ఉన్నారని వారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారి వీధిలో ఉన్న అనేకమంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రహదారికి అడ్డంగా మృతదేహాన్ని ఉంచడంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది దీంతో విషయం తెలుసుకున్న ఉరవకొండ అర్బన్ సీఐ హరినాథ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని మృతుడి బంధువులకు నచ్చ చెప్పారు సమస్యను మాట్లాడుకోవాలి తప్ప రోడ్డెక్కి ఆందోళన చేయొద్దంటూ వారికి తెలిపారు అనంతరం సిఐ కూడా ఎంపీడీవో చర్చలు జరిపారు మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img