Friday, April 26, 2024
Friday, April 26, 2024

మెగా వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఈనెల 21వ తేదీన మంగళవారం నిర్వహించే ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వజ్ర కరూర్ జడ్పిటిసి సభ్యులు తేజేశ్వరి, కురుబ సంఘం రాష్ట్ర యూత్ అధ్యక్షులు వసకేరి రమేష్ బాబు, ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు వసికేరి మల్లికార్జున తెలిపారు.సోమవారం వజ్రకరూరు మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడుతూ శాంతారాం ఆస్పత్రి వారి సౌజన్యంతో ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ వైద్య శిబిరంలో ప్రధానంగా గుండె, కంటి ఆపరేషన్లు మరియు మోకాలు, భుజము, మెడకు సంబంధించిన సమస్యలకు శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు కూడా ఉచితంగానే నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ కూడా పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఆపరేషన్లు అవసరమైన వారికి సంబంధించి సదుపాయాలు అన్నీ కూడా ఉచితంగానే అందించడం జరుగుతుందని అలాగే వైద్య శిబిరానికి వచ్చే ప్రజలందరికీ కూడా భోజన సౌకర్యాలు కూడా కల్పిస్తున్నట్లు వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img