Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

మే డే ను ఏఐటియుసి కార్మికులు జయప్రదం చేయండి…

పట్టణంలోని అన్ని కార్మిక సంఘాలకు పిలుపు…

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు…

విశాలాంధ్ర-గుంతకల్లు : శ్రమ జీవులకు, కష్టజీవులకు పండుగ వాతా వరణంల జరుపుకునే ఃమే డేః రోజును అన్ని కార్మిక సంఘాలు ఘనంగా జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు కార్మికులకు పిలుపునిచ్చారు.శుక్రవారం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో ముఖ్య అతిథులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి.గోవిందు, సిపిఐ నియోజవర్గం కార్యదర్శి వీరభద్ర స్వామి, సిపిఐ నియోజవర్గం సహాయ కార్యదర్శి బి.మహేష్, సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ టి.సురేష్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా బి.గోవిందు మాట్లాడుతూ..1886లో చికాగో నగరంలో హే మార్కెట్‌లో కార్మికులు 8గంటల పని విధానం కోసం ఏ రకంగా తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. ఇప్పుడు ఆ ఉద్యమస్ఫూర్తిని కొనసాగిస్తూ కార్మిక హక్కులు చట్టాలు కాపాడుకొవాలన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వాలు పనిచేసే విధంగా పోరాటం చేయాలని తెలిపారు. ఉద్యోగకార్మికుల, అసంఘటిత కార్మికుల హక్కులను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ కార్మికులను బిచ్చగాళ్ళుగా చేసే పరిస్థితి దేశంలో బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కార్పొరేట్‌ విధానాలను అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వాలు 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ నాలుగు కార్మిక కొడ్లను అమలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చడం దుర్మార్గమన్నారు.ఈ సంధర్బంగా వీరభధ్రస్వామి,బి.మహేష్ ,గోపినాథ్ ,ఈశ్వరయ్య,రాము మాట్లాడుతూ…మేడే రోజును కార్మికులు పెద్ద ఎత్తున అన్ని అడ్డాలలో జెండాలను ఎగురవేసి జయప్రదం చేయాలని ఏఐటియుసి కార్మికులను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్,సీపీఐ నాయకులు మల్లయ్య,ప్రసాద్ ,ఏఐఎస్ ఎఫ్ ఆర్గనేజింగ్ నియోజికవర్గం కార్యదర్శి వినోద్ ,అన్ని హమాలి సంఘాల కార్మిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img