Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యూనియన్ బ్యాంక్ కరెస్పాండెంట్ శివారెడ్డి పై కేసులు నమోదు చేయండి..

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని సుదర్శన్ కాంప్లెక్స్ లో గల యూనియన్ బ్యాంకులో బ్యాంకు కరెస్పాండెంట్ గా పనిచేస్తున్న శివారెడ్డి పై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని రీజినల్ మేనేజర్ కు సమాచారం అందించి, బ్యాంకు మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల కిందట రూరల్ పరిధిలోని రేగాటిపల్లిలోని 26 డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన దాదాపు ఒక కోటి రూపాయలకు పైగా స్వాహా కావ డంవిషయంపై శుక్రవారం నేరుగా ఎమ్మెల్యే బ్యాంకుకు చేరుకొని మేనేజర్ తో జరిగిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకు మేనేజర్ తో ఈ స్వాహా విషయంపై పలు అంశాలపై వారు చర్చించారు. ఇంత పెద్ద మొత్తము రెండు సంవత్సరాలుగా మీ బ్యాంకులో ఎందుకు జమ కాలేకపోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఆడిట్ కూడా ఆస్కారం లేని విధంగా ఎలా జరిగిందని వారు ప్రశ్నించారు. అనంతరం రీజినల్ మేనేజర్ కు వెనివెంటనే ఈ మోసపూరిత అంశాన్ని తెలిపి డ్వాక్రా మహిళలకు న్యాయం చేయాలని వారు మేనేజర్ కు సూచించారు. తదుపరి డ్వాక్రా మహిళలచే వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదును అందజేశారు. డ్వాక్రా మహిళలకు న్యాయం జరిగేంత వరకు తాను పోరాడతానని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అన్న విషయాన్ని కూడా త్వరలోనే తెలుసుకుంటానని తెలిపారు. ఎమ్మెల్యే స్పందనకు డ్వాక్రా గ్రూప్ మహిళలందరూ కూడా కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రేగాటిపల్లి సర్పంచ్ సురేష్ రెడ్డి, వన్టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం, డ్వాక్రా గ్రూపు బాధితులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img