Friday, April 19, 2024
Friday, April 19, 2024

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ చూపాలి

వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌
విశాలాంధ్ర`ఉరవకొండ : కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఈనెల 9వ తేదీ నుంచి మూడు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలలో అండర్‌ 18 బాలికల జిల్లా జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎదగాలని ఉరవకొండ మండలం మోపిడి ప్రభుత్వ హైస్కూల్‌ వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా జట్టును గురువారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జట్టుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఖో ఖో జిల్లా కార్యదర్శి నిరంజన్‌ రెడ్డి, అధ్యక్షులు పుల్లారెడ్డి సలహాలు సూచనలు మేరకు గత పది రోజులుగా మోపిడి గ్రామంలోని సంజప్ప తాత దేవాలయం మైదానంలో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. బాలికలకు పది రోజులపాటు శిక్షణ ఇవ్వడానికి గ్రామ పెద్దలు యొక్క సహాయ సహకారాలు మరువ లేనివని శిక్షణ కాలంలో గ్రామ పెద్ద జగన్నాథ్‌,జ్యోతి దంపతులు క్రీడాకారులకు భోజన ఏర్పాటు చేశారన్నారు. అలాగే క్రీడ మైదానం ఇవ్వడానికి కూడా దేవాలయ కమిటీ పెద్దలు ధనంజయ మరియు రాజ్‌ కుమార్‌ సహాయం చేశారని రాష్ట్రస్థాయి పోటీలకు వెళ్లే బాలికల జట్టుకు గ్రామ సర్పంచ్‌ సిద్ధప్ప ఆర్థిక సహాయ సహకారాలు అందించారని వీరితోపాటు స్కూల్‌ చైర్మన్‌ సతీష్‌, ఉపసర్పంచ్‌ లీలప్ప, సంజయ్‌ కూడా వారి వంతు సహాయ సహకారాలను అందించారని ప్రభాకర్‌ తెలిపారు. శిక్షణ కాలంలో ఏర్పాట్లు చేసిన గ్రామ పెద్దలను జిల్లా క్రీడాకారులు సన్మానం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img