Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వము యొక్క లక్ష్యం : ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి

విశాలాంధ్ర`ధర్మవరం : రాష్ట్ర అభివృద్ధి ప్రభుత్వ యొక్క లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అభివృద్ధి బాటలో నడుస్తున్నారని, ఇందుకు ప్రజలు కూడా పూర్తిగా మద్దతు పలకడం పట్ల ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 40 వార్డులలో నాడు- నేడు, గడప గడప ప్రత్యేక పథకం,మున్సిపల్‌ సాధారణ నిధులు.. ఆరు కోట్ల 50 లక్షల నిధులతో పట్టణంలోని పాఠశాలల్లో అదనపు తరగతులు నిర్మాణ కార్యక్రమం, వార్డులలో సిమెంట్‌ రోడ్లు, సిమెంటు కాలువలు, నిర్మించే నిమిత్తం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 40 వార్డులలో భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత కౌన్సిలర్లు ,ఇంచార్జ్‌ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో బైక్‌ ర్యాలీని నిర్వహించారు. తదుపరి ఆయా వార్డుల్లో కౌన్సిలర్ల, మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ల ఆధ్వర్యంలో శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు భూమి పూజ నిర్వహించారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు వందకు వంద శాతం అమలు చేసిన ఘనత వారికేద కిందన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు, పార్టీలకు అతీతంగా ఇంటి పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని, పెన్షన్లు వివిధ సమస్యలతో కూడినటువంటి అన్నిటికి కూడా పరిష్కార మార్గా దశలో నేడు కృషి చేయడం జరుగుతుందన్నారు. పట్టణంలోని 40 వార్డుల ప్రజలు, వైఎస్‌ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూలవర్షం, పూలదండలతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి మున్సిపల్‌ కమిషనర్‌ ఆనంద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ లింగ నిర్మల, వైస్‌ చైర్మన్లు పెనుజూరు నాగరాజు, భాగ్యలక్ష్మి, కో ఆప్షన్‌ సభ్యులు, 40 మంది వార్డు కౌన్సిలర్లు, మాజీ వైస్‌ చైర్మన్‌ లు చందమూరి నారాయణరెడ్డి, మాసపల్లి సాయికుమార్‌, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ ఈఈ సత్యనారాయణ, డి ఈ వన్నూరు స్వామి, ఏఈలు హరీష్‌, ప్రతాప్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img