Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రీ సర్వే పూర్తి చేయుటలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలి.. ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర ^ధర్మవరం : రీ సర్వే పూర్తి చేయుటలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆర్డీవో తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవాంగ కళ్యాణ మండపంలో డివిజన్ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి ,ముదిగుబ్బ, రామగిరి, సికేపల్లి, కనగానపల్లి మండలాలకు చెందిన తాసిల్దార్లకు, ఎంపీడీవో, ఈవో ఆర్డీలకు, మండల సర్వేయర్స్కు, రీ సర్వే డిప్యూటీ ఎమ్మార్వో, ఆర్ఐలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, వీఆర్ఏలకు, డిజిటల్ అసిస్టెంట్స్, పంచాయతీ సిబ్బంది లకు రీసర్వే పై శిక్షణ తరగతులను నిర్వహించారు. రీ సర్వేపై పాటించవలసిన పద్ధతులను డీఏవో ఖతిజు న్ కుప్రా, బాలాజీ లు ప్రొజెక్టర్ ద్వారా రీ సర్వే పద్ధతుల వివరాలను క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఆర్డిఓ తిప్పే నాయక్, పంచాయితీ జిల్లా అధికారి విజయకుమార్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు మాట్లాడుతూ ఁవైయస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష పథకంపైఁ పూర్తి దశలో శిక్షణను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది సమన్వయంతో తమ విధులను నిర్వర్తించినప్పుడే విజయవంతమవుతుందని తెలిపారు. మండల పరిధిలోని ప్రతి గ్రామమునందు రి సర్వే చేయాలని, రీ సర్వే చేసే ముందు పిఓఎల్ఆర్ ప్రొఫార్మా 6 పూర్తి చేసి ఉండాలన్నారు. అదేవిధంగా ప్రతి గ్రామములో రెవెన్యూ రికార్డులను ప్యూరిఫై చేసుకోవాలని తెలిపారు. గ్రామ సరిహద్దులను నిర్ధారించుట, ప్రభుత్వ భూములను గుర్తించుట, సరిహద్దు రాళ్ళను గుర్తించడం చేయాలన్నారు. గ్రామ కోర్ కమిటీ ద్వారా ఈ రి సర్వే ప్రక్రియను పూర్తి చేసే దిశలో, అందరూ కృషి చేయాలని తెలిపారు. ప్రైవేటు భూములు ఉన్న యెడల సంబంధిత పట్టాదారులకు ఫారం 19 నోటీస్ అందజేయాలన్నారు. ఈ రీ సర్వేకు 59 ప్రొఫార్మాలు పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత, ఆయా సంబంధిత అధికారులు దేనిని తెలిపారు. రీ సర్వే ప్రక్రియలో తప్పకుండా పాటించాల్సిన పద్ధతులను విధిగా నిర్వర్తించాలని మరోసారి సూచించడం జరిగిందన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా భూహకుపత్రాలను పంపిణీ చేయాలని తెలిపారు. తదుపరి శిక్షణా కార్యక్రమంలో వచ్చిన అనుమానాలను కూడా నివృత్తి చేయడం జరిగిందన్నారు. రీ సర్వేలో ఎటువంటి నిర్లక్ష్యము, అశ్రద్ధ ఉండరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎల్పిఓ బాలాజీ, నాగరాజు, జిల్లా సర్వేయర్ అండ్ ల్యాండ్ అధికారి రామకృష్ణ, ధర్మవరం ఎమ్మార్వో యు గేశ్వరి దేవి తో పాటు ఏడు మండలాలకు సంబంధించిన వివిధ విభాగాల ప్రభుత్వ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img