Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రెజ్లర్లకు దేశమంతా అండగా నిలవాలి

వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ ని తక్షణమే అరెస్టు చేయాలి

సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సి. జాఫర్

విశాలాంధ్ర -ఉరవకొండ : లైంగిక వేధింపులకు గురైన మహిళా రెజ్లర్లు కు దేశమంతా కూడా అండగా నిలవాలని వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ ను తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ పార్టీ అనంతపురం జిల్లా కార్యదర్శి సి.జాఫర్ అన్నారు. ఆ పార్టీ నాయకులుతో కలిసి గురువారం ఉరవకొండలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయని అయినా పోలీసులు మాత్రం బ్రిజ్‌ భూషన్‌ శరణ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు.ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ రెజ్లర్లు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు నోటీసులు కూడా జారీ చేసిందని భారత ప్రధాన న్యాయమూర్తి లతో కూడిన ధర్మాసనం రెజ్లర్లు చేసిన ఆరోపణలు తీవ్రమైనవ ని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులు మరియు ఢిల్లీ ప్రభుత్వం. నుండి ప్రతిస్పందన కూడా కోరిందన్నారు. లైంగిక వేధింపులపై వీడియో రికార్డింగ్‌లు ఉన్నా, మహిళలు వేధింపులకు గురయ్యారన్నా ఆధారాలు ఉన్నా ఎందుకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదని పోలీసులను సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై త్రివర్ణ పథకాన్ని ఎగురవేసి దేశ గౌరవాన్ని పెంచిన మల్ల యోధులకు అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం, భారతీయ మహిళ జాతీయ సమైక్య, అఖిల భారత సంస్కృత సాంస్కృతిక సంఘటన్,ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సంఘటన్ రోడ్ ఎక్కిన రెజ్లర్లకు సంఘీభావ ప్రకటించాయన్నారు. అంతేకాకుండా రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం సాగించిన సంయుక్త కిసాన్ మోర్చా కూడా బాసటగా నిలిచిందన్నారు. స్త్రీ నీ దేవతగా భావించే భారతీయ సంస్కృతికి తీరని అప్రతిష్ట వాటిల్లినప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గర్హనీయమన్నారు. కామన్వెల్త్ పోటీల్లో పథకాలను సాధించిన క్రీడాకారులు న్యాయం కోసం వీధిలోకి పోరాటం చేయడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వేధింపులకు పాల్పడిన ఎంపి ని తక్షణమే అరెస్టు చేసి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి,నాగరాజు, రాష్ట్ర గిరిజన సమాఖ్య అధ్యక్షులు రామాంజనేయులు, ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున సహాయ కార్యదర్శి మనోహర్, రమేష్, రైతు సంఘం నాయకులు నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img