Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం

విశాలాంధ్ర-ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం పప్పు సెనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలం చెందిందని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి జే. మల్లికార్జున ఆరోపించారు. గురువారం ఉరవకొండ సమీపంలో దళారుల చేతిలో మోసపోతున్న పప్పు సెనగ రైతులను సిపిఐ,రైతు సంఘం నాయకులు కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పడుతున్న కష్టాలను మల్లికార్జున విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పప్పు శనగను రైతులు తక్కువ ధరకే అమ్ముకోవడం జరుగుతోందని,ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర రూ.5330 రూపాయలు కు ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు కొనుగోలు చేయడం లేదన్నారు. ఇప్పటికే దాదాపు 75 శాతం మంది రైతులు క్వింటాళ్లు రూ,4500 దళారులకు అమ్ముకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని ప్రకటించిన దరికే మిగిలిన రైతులతో ఉన్న పప్పుశనగ కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, రైతు సంఘం నియోజకవర్గ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img