Friday, April 19, 2024
Friday, April 19, 2024

రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకే రైతు భరోసా కేంద్రాలు…

ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి…
విశాలాంధ్ర`బుక్కపట్నం: రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు అన్ని విధాలుగా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలు ప్రవేశపెట్టిందని ఎంపీ గోరంట్ల మాధవ్‌, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డిలు తెలిపారు. శనివారం అనంతపురం జిల్లా బుక్కపట్నం మండల పరిధిలోని బుచ్చయ్యగారిపల్లిలో రైతు భరోసా కేంద్రం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారికి అన్ని విధాలుగా అభివృద్ధి వైపు ప్రవేశపెట్టి రైతుల్లో వ్యవసాయం పట్ల ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని, రైతు భరోసా కేంద్రాలు ద్వారా ప్రతి గ్రామంలో రైతులు రైతు సంక్షేమ పథకాలతో పాటు, పంట గిట్టుబాటు ధర, విత్తన కొనుగోలు వంటి సంక్షేమ పథకాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసిందని వైసీపీ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో 90 వేల నీటి సామర్థ్యం గల ఓవర్‌ హెడ్‌ ట్యాంకును ప్రారంభించారు. ఈకార్యక్రమంలో సర్పంచులు నాగలక్ష్మి రాజు, రూప, వ్యవసాయ అధికారి సతీష్‌ బాబు మండల కన్వీనర్‌ సుధాకర్‌ రెడ్డి, అగ్రి అడ్వైజరీ చైర్మన్‌ రమణారెడ్డి, నాయకులు రామలింగారెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి, కేశప్ప, శ్రీధర్‌ రెడ్డి, పెయింటర్‌ వెంకటేష్‌, పూలకుంట నాగభూషణ, రంగారెడ్డి, ఎల్‌ఐసి చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img