Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

లింగ నిష్పత్తిని కాపాడుకోవడం మనందరి బాధ్యత

: డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బయ్య దొర
విశాలాంధ్ర-రాప్తాడు :
లింగ నిష్పత్తిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బయ్య దొర సూచించారు. రాప్తాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డీఐఓ డాక్టర్ యుగంధర్ తో కలిసి సందర్శించారు. డీఎంహెచ్ఓ మాట్లా డుతూ బాలికలకు మంచి విద్యను అందించడం ద్వారా సమాజం ప్రగతిలో నడుస్తుందన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని.. కుటుంబాలలో మహిళ పాత్ర ఎంతో అత్యున్నతమైనదని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతను వివరించారు. బాల్య వివాహాలు, చిన్న పిల్లలతో పనులు చేయించడం చట్టరీత్యా నేర మన్నారు. ఆర్టికల్‌21(ఎ), నాల్సా పథకం 2015, డివిసి యాక్ట్‌, పిసి అండ్‌ పిఎన్‌డిటి యాక్ట్‌, తల్లిదండ్రుల ఆస్తిలో అమ్మాయిలకు సమాన హక్కు వంటి విషయాలను తెలియజెప్పాలన్నారు. . వివాహ వయస్సు అమ్మాయిలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు ఉండాలన్నారు. భ్రూణహత్యల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
బేటీ బచావో, బేటీ పఢావోలో భాగంగా ఆడపిల్లను రక్షించండి, ఆడపిల్లలకు చదువు చెప్పండి అనేది భారతదేశంలోని బాలికల సంక్షేమం కోసం, వారి చదువుల కోసం ప్రవేశ పెట్టిన కార్యక్రమంతోపాటు దిశ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పీహెచ్సీలోనే సుఖ ప్రసవాలు చేయాలన్నారు. అనంతరం రాప్తాడు -1 సచివాలయంలో చిన్నారులకు వేసే వ్యాధి నిరోధక టీకాల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ శివకృష్ణ, సూపర్వైజర్లు అరుణ, లక్ష్మీనరసమ్మ, ఏఎన్ఎంలు లీలావతి, అనిత, స్టాఫ్ నర్స్ లక్ష్మీ, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img