Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లింగ వివక్షత నిర్మూలన చట్టం పై అవగాహన

విశాలాంధ్ర- బొమ్మనహళ్: మండలంలోని లింగద హల్ గ్రామంలో వైద్యాధికారి గీతాభార్గవి ఆధ్వర్యంలో గురువారం వైద్య సిబ్బంది లింగ వివక్షత నిర్మూలన చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్భవతులు నాలుగు నుండి ఐదు మాసాల సమయంలో స్కానింగ్ ద్వారా గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేయరాదని 1994 ూజూచీణు యాక్ట్ తెలియజేస్తుంది.నేటి ఆడపిల్ల రేపటి అమ్మ అని, ఈ రోజు మనం ఆడపిల్లను వద్దనుకుంటే రేపు మన సమాజం అమ్మలేని అనాథ అవుతుందని,ప్రజలు గమనించాలని,గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారికి మరియు ప్రోస్తహించిన వారికి రూఁ 10,000 / జరిమాన తో పాటు ,మూడు సంఁ జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్ హెచ్ పి అలివేలు ఏఎన్ఎం ఎర్రమ్మ, హెల్త్ అసిస్టెంట్ వెంకటరమణ,అంగన్వాడీ టీచర్ సౌజన్య,ఆశ గంగమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img