Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

లోకేష్ పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటి

సీఎం జగన్ పై విమర్శలు చేయడానికే ఈ పాదయాత్రనా….

గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి

విశాలాంధ్ర-గుంతకల్లు : లోకేష్ పాదయాత్ర తండ్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో కేవలం జగన్మోహన్ రెడ్డిని లోకల్ ఎమ్మెల్యే లపై దూషించడానికి ఈ పాదయాత్ర బహిరంగ సభల అని గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ… వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు.ఏ ఒక్క దళారీ లేకుండా నేరుగా ఖాతాల్లో జమ చేస్తున్నాడని అన్నారు. ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా పని చేస్తున్నాడని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు అంటూ మెగా పీపుల్ సర్వేలో ఒక కోటి కుటుంబాలకు పైగా ప్రజా అభిప్రాయంలో సంక్షేమ పథకాలపై హర్షం వ్యక్తం చేశారని తెలిపారు.రాబోయే ఎన్నికలలో ప్రజా ఆమోదం పొందిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు 175 కి 175 సీట్లు దక్కుతాయని తెలిపారు. నారా లోకేష్ పాదయాత్ర చంద్రబాబు నాయుడు బహిరంగ సభలలో జగన్ ని దూషించడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చిన దాఖలాలు లేవని ప్రశ్నించారు. జగన్ పాదయాత్రలో పేద ప్రజలకు ప్రతి ఒక్క సమస్యలు తెలుసుకుంటూ హామీలు ఇచ్చుకుంటూ వెళ్లారని అయితే అధికారం చేపట్టి 98 శాతం సంక్షేమ పథకాలు పూర్తి చేశామని తెలిపారు. జగన్ ని దూషించడం చాలించి ప్రజలకు హామీలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్ళండి అని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామలింగప్ప ,మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎస్వీఆర్ మోహన్ ,రాష్ట్ర వీరశైవ కార్పొరేషన్ డైరెక్టర్ యుగంధర్ రెడ్డి ,మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ భీమ లింగప్ప, పట్టణ అధ్యక్షులు సుంకప్ప, మాజీ పట్టణ అధ్యక్షులు ఎద్దుల శంకర్ ,మండల కార్యదర్శి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img