Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వంట నష్టం జరిగింది ఆదుకోండి.. కౌలు రైతు ఆవేదన

విశాలాంధ్ర- ధర్మవరం : మండల పరిధిలోని ఉప్పునీపల్లి గ్రామ పొలంలో ఆదివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు, ఈదురు గాలులకు లక్ష్మీనారాయణ అనే కౌలు రైతు పూర్తిగా నష్టపోయానని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం రైతు మాట్లాడుతూ తనకున్న ఐదు ఎకరాల పొలమును లీజు తీసుకొని అందులో 80 నేరేడు చెట్లను రెండు సంవత్సరాల నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చానని తెలిపాడు. కాపుకు రావడంతో వచ్చేవారం పంటను తొలగించి మార్కెట్కు తరలించే సమయంలో ఆదివారం సాయంత్రం బలమైన ఈదురు గాలులు వడగళ్ల వర్షానికి దాదాపు 25 నేరేడు చెట్లు మొత్తం నేల కులాయని బాధ ను వ్యక్తం చేశారు. మొత్తం పంట అంతా నేలపాలైందని టన్ను రెండున్నర లక్ష పలికే సమయంలో ఇలాంటి ప్రకృతి వైపరీత్యం జరగడం నన్నెంతగానో అప్పులపాలు చేసిందని తెలిపారు. దాదాపు 5 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు రైతు తెలిపాడు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆదుకోవాలని రైతు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img