Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వాహన రుణాలను సద్వినియోగం చేసుకోండి

విశాలాంధ్ర`కళ్యాణదుర్గం టౌన్‌ : కళ్యాణదుర్గం సహకార బ్యాంకులో వాహన రుణ పథకాన్ని నూతనంగా ప్రారంభించినట్లు మేనేజర్లు మల్లికార్జున మల్లికార్జున సూపర్వైజర్‌ పవన్‌ కుమార్‌ ప్రకటన ద్వారా తెలియజేశారు. వారు తెలిపిన వివరాలు ఇలా సహకార బ్యాట్‌ నందు ఇదివరకే వ్యవసాయ వ్యవసాయేతర రంగాలలో రుణాలు విరివిగా ఇవ్వడం జరిగిందన్నారు. రైతు మహిళ స్వయం సహాయక సంఘాలకు కూడా మా బ్యాంకు పెద్ద పీట వేసిందన్నారు. చిరు వ్యాపారాలకు రుణ సహాయాన్ని బ్యాంకు అందించినట్లు వారి ఆర్థిక అభివృద్ధికి ఎంతో తోడ్పడిరది అన్నారు . తాజాగా కళ్యాణదుర్గం బ్రాంచ్‌ నందు వాహన రుణ పథకాన్ని పెద్ద ఎత్తున ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా కారు, మోటార్‌ బైకులు, ఇతరాతన వాహనాలు కు గరిష్టంగా 15 లక్షల వరకు మా బ్యాంకు రుణ సౌకర్యం కల్పిస్తుంది అన్నారు. ఇందుకుగాను నెలసరి, 3 నెలలు, 6 నెలలు, సులభ వాయిదా పద్ధతిలో అతి తక్కువ 8.5 శాతం వడ్డీతో రుణాన్ని సహకార బ్యాంకు ద్వారా ప్రజల సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. వీటితోపాటు బ్యాంకు నందు డిపాజిట్‌ దారులకు ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీ చెల్లించే పథకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సహకార ధన దర్శి డిపాజిట్‌ ద్వారా సీనియర్‌ సిటిజన్లకు8.25 శాతం వడ్డీ ఇతరులకు7.63 శాతం వడ్డీ సౌలభ్యం బ్యాంకు కల్పిస్తుందని ఫిక్స్డ్‌ డిపాజిట్‌ లపై సహకార బ్యాంకు ఇతర బ్యాంకుల కంటే అధిక వడ్డీతో నూతన డిపాజిట్‌ పై పథకాలు మరికొన్ని అందుబాటులో ఉన్నాయని గోల్డ్‌ లోన్‌ దారులకు లాకర్‌ సదుపాయం కలదని, ఆర్టిజిఎస్‌, నెఫ్ట్‌ సౌకర్యం కలదని మరిన్ని వివరాల కోసం కళ్యాణదుర్గం పట్టణం నందు గాంధీ సమీపానగల సహకార బ్యాంకు శాఖలో సంప్రదించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img