Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వికలాంగుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండాలి

విద్యావేత్త డి.ఎర్రి స్వామి
విశాలాంధ్ర`ఉరవకొండ : వికలాంగుల పట్ల ప్రేమ అభిమానం కలిగి ఉండాలని విఠల్‌ రుక్మిణి వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు విద్యావేత్త అయిన డి. ఎర్రి స్వామి అన్నారు. గురువారం ఉరవకొండలో అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని చైతన్య దివ్యాంగుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొన్న వికలాంగులు స్థానిక అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక గవి మఠం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశాన్న ఉద్దేశించి డి. ఎర్రిస్వామి మాట్లాడుతూ ప్రభుత్వాలు వికలాంగులకు ప్రత్యేక సంక్షేమ పథకాలు కల్పించాలని,వారు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి తక్షణమే పరిష్కరించాలని,డాక్టర్లు అందించే వికలాంగుల శాతం సర్టిఫికెట్లులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలను అందించాలన్నారు. వికలాంగుల పట్ల ఎవరు కూడా చిన్నచూపు చూడరాదని వికలాంగులలో దాగివున్న నైపుణ్యాలను గుర్తించి వారిని ప్రోత్సహించాలన్నారు. ఈ సందర్భంగా చైతన్య దివ్యాంగుల సేవా సంఘం నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో చైతన్య సేవా సంఘం అధ్యక్షులు వడ్డే నాగేంద్ర, ఉపాధ్యక్షులు చోటావలి, కార్యదర్శి వడ్డే శివ రుద్ర, సహాయ కార్యదర్శి మీనుగా మోహన్‌ బాబు, కోశాధికారి ఆర్కేటి జలాన్‌, సంఘం సభ్యులు హమీద్‌ రషీద్‌, వడ్లవలి, సామాజిక సేవా కార్యకర్త లాలూ ప్రసాద్‌ వీరితో పట్టు మహిళా సభ్యులు సరోజమ్మ,, పార్వతి, త్రివేణి రేష్మ,సువర్ణ, అనిత తదితరులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img