Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

విద్యార్థులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉండాలి.. ఆర్డీవో తిప్పే నాయక్

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణములో నీ 15 పరీక్షా కేంద్రాలలో పదవ తరగతి విద్యార్థులందరికీ కూడా మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని, చీఫ్ సూపర్డెంట్లు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలని ఆర్డిఓ తిప్పే నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆర్డిఓ జడ్పీ హైస్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జీవనజ్యోతి పరీక్షా కేంద్రాలను వారు ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. తదుపరి పరీక్ష గదులలో విద్యార్థుల యొక్క సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్న వివరాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. గదులను క్షుణ్ణంగా పరిశీలించి,తాగునీరు, వైద్యం ఎప్పటికప్పుడు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను విధిగా అందరూ పాటించాలని తెలిపారు. అదేవిధంగా పరీక్షా గదులలో సీసీ కెమెరాలు, ఫ్యాన్లు వ్యవస్థ, వెలుతురు తదితర వాటిని కూడా వారు పరిశీలించారు. ఇన్విజిలేటర్ల, విద్యార్థుల వద్ద ఎటువంటి సెల్ఫోన్లు లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని తెలిపారు. పరీక్షా కేంద్రంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులను లోనికి రానీయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పరీక్షా కేంద్రంలోని పోలీసులకు వారు సూచించారు. మొత్తం మీద పరీక్షలు సజావుగా జరిగాయని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img