Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఉపాధ్యాయులే ఇవ్వాలి.. ఇంచార్జ్‌ డిఇఓ మీనాక్షి దేవి

విశాలాంధ్ర`ధర్మవరం : విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఉపాధ్యాయులే ఇవ్వాలని శ్రీ సత్య సాయి జిల్లా ఇన్చార్జి డిఈఓ మీనాక్షి దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో లిప్‌ శిక్షణా తరగతులను వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో ఆర్పీలు మదన్మోహన్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, ప్రేమ్‌ సాయిలు ఆయా సబ్జెక్టులలో గల మెలుకువలను లను తెలియజేశారు. ఆయా సబ్జెక్టులలో పాఠ్యాంశాల బోధన తీరు యొక్క వివరాలను కూడా తెలియజేశారు. ఈ శిక్షణా తరగతులు శనివారంతో ముగుస్తాయని తెలిపారు. అనంతరం ఇంచార్జ్‌ డిఇఓ మీనాక్షి దేవి మాట్లాడుతూ నేడు ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అన్ని సదుపాయాలను కలిగించిందని, ఆ సదుపాయాలను విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా సద్వినియోగం చేసుకున్నప్పుడే అనుకున్న విజయం లభిస్తుందన్నారు. ఈ రెండు రోజుల్లో గణితము, సామాన్య, సాంఘిక ,తెలుగు, ఆంగ్లం లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తాను చెప్పే పాఠాన్ని ముందుగానే ప్రిపేర్‌ అవుతూ తరగతి గదిలో తాను చెప్పిన పాఠం యొక్క అర్థము ఎంతమందికి చక్కగా అవగాహన అయిందో అనేది కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ లిప్‌ శిక్షణ తరగతులను ప్రతి ఉపాధ్యాయుడు తమ తమ విషయాల్లో విద్యార్థులకు తప్పక మెలకువలతో కూడిన బోధన చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సుధాకర్‌ నాయక్‌ నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img