Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యార్థులకు రాగి జావా అందించడం హర్షనీయం

గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు

విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి ఐరన్ క్యాల్షియం వంటి పోషకాలు అందించి వారిలో రక్తహీనత పోషకాల లోపాన్ని నివారించేందుకు బెల్లం తో కూడిన రాగి జావాను విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం హర్షనీయమని ఉరవకొండ మండలం రేణి మాకులపల్లి గ్రామ సర్పంచ్ బోయ రామాంజనేయులు తెలిపారు. మంగళవారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో రాగి జావా అందించే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద లో భాగంగా మరో పోషిక ఆహారం విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టడం వల్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను, పౌష్టిక ఆహారాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని భవిష్యత్తులో మంచి ఆరోగ్యాన్ని ఉన్నత విద్యను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది,విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img