Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విద్యార్థుల హక్కుల పైన, లైంగిక నేరాల పైన అవగాహన కార్యక్రమం

విశాలాంధ్ర-పెనుకొండ : పెనుకొండ మండల పరిధిలోని గుట్టురు మరియు వెంకటగిరి పాళ్యం ప్రభుత్వ పాఠాశాల యందు శనివారం కియా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ మరియు మహిళా సిబ్బంది పోలీస్ సిబ్బంది కలిసి పిల్లలు అందరితో సమావేశం ఏర్పాటు చేసి చిన్న పిల్లల పై జరిగే లైగింక నేరాలు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, చిన్న పిల్లల అశ్లీల వీడియో లు, పోస్టర్ లు, తీయడం ప్రచారం చేయడం నేరము అని ఐటీ ఆక్ట్ మరియు పోక్సో ఆక్ట్ ప్రకారం తీవ్రమైన నేరాలు గా బావించబడుతాయి అని అలాగే పిల్లల హక్కులు అయిన నిర్భంద విద్య హక్కు, చైల్డ్ లేబర్, బాల్య వివాహాలు గురించి కూడా అవగాహన కల్పించడం జరిగింది పిల్లలకు గ్రామాలలో ఎవరైనా ఆకతాయిలు వెకిలి చేష్టలు చేయడం ఇబ్బందులు కలకచేయడం గ్రామీణ ప్రాంతాల నుంచి హై స్కూల్ కు వచ్చే విద్యార్థిని విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని వారి తెలియచేసిన వారి పేర్లు గోప్యంగా ఉంచి ఆకతాయిలపై తగిన చర్యలు తీసుకుంటామని అలాగే ఏమైనా ఇబ్బందులు ఉంటే సచివాలయంలో మహిళా పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారని వారికి విషయాన్ని తెలియజేయాలని ఎస్సై వెంకటరమణ తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img