Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు పనులు వెంటనే ప్రారంభించండి

ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి
విశాలాంధ్ర`ఉరవకొండ :
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 85 నూతనంగా33/11 విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపదలను సిద్ధం చేసిందని వాటిని వెంటనే ఆమోదించి పనులు ప్రారంభించాలని జిల్లా ఇన్చార్జ్‌ మంత్రి మరియు విద్యుత్‌ శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి గురువారం విజయవాడలో కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల భూగర్భ జలాలు కూడా విపరీతంగా పెరిగాయని దీనివల్ల విద్యుత్‌ వినియోగం కూడా పెరిగిందని రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి తక్షణమే ప్రతిపాదించిన సబ్‌ స్టేషన్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని కోరినట్లు తెలిపారు.
9 నూతన సబ్‌ స్టేషన్‌ లకు ప్రతిపాదనలు
ఉరవకొండ నియోజకవర్గం లో 9 నూతన 33/11 కె.వి విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు నిర్మాణానికి ప్రతిపాదనలను పంపినట్టు ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి తెలిపారు. కూడేరు మండలంలోని అరవకూరు, జల్లిపల్లి, ఉరవకొండ మండలంలో నింబగల్లు, కౌకుంట్ల, రాకెట్ల, వజ్రకరూరు మండలం పిసి ప్యాపిలి, విడపనకల్లు మండలం గడేకల్లు బెలుగుప్ప మండలం నక్కలపల్లి, రాం సాగరం గ్రామాలలో విద్యుత్‌ సబ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img