Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

విలేకరులపై దురుసుగా ప్రవర్తించిన మంతకల్లు రెడ్డి పై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు…

విశాలాంధ్ర-గుంతకల్లు : పట్టణంలో హత్యకు గురైన జిపి హేమకోటిరెడ్డి అంత్యక్రియలకు వార్తలు కవరేజ్ కు వెళ్లిన విలేకరులపై దురుసుగా అసభ్యకరంగా దుర్భసలాడుతూ ప్రవర్తించిన మంతకల్లురెడ్డిపై ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని గుంతకల్లు పాత్రికేయ సంక్షేమ సంఘం ప్రతినిధులు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.హత్యకు గురైన జిపి హేమా కోటిరెడ్డి ఇంటివద్దకు అమెరికా నుంచి వచ్చిన భార్య డాక్టర్ సరోజమ్మ , కుటుంబ సభ్యులను అదేవిదంగా అంత్యక్రియలకు కవరేజ్ కోసం విలేకరులు వెళ్లారు. అసభ్య పదజాలంతో దూశించి బయటకు పంపండని మంతకల్లు రెడ్డి విలేకరులపై విరుచుకుపడ్డాడు. వెంటనే గుంతకల్లు పాత్రికేయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
టూటౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ గణేష్ కు ఫిర్యాదు చేశారు. సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ… పాత్రికేయులపై అసభ్య పదజాలంతో దూషించడం అమానవీయమన్నారు. విలేకరులను దూషించిన మంతకల్లు రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కులం పేరుతో దూశించినందున ఎస్ ఎస్సి ఎస్టి అట్రాసిటి కేను ను నమోదు చేయాలని వినతిపత్రాన్ని సిఐ గణేష్ కు పాత్రికేయులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు హరి గోపాల్ డ(గోపి) ,ఆంధ్రజ్యోతి విలేఖరి రఫిక్ ఆంధ్రజ్యోతి రమేష్, సాక్షి రవి సాక్షి టీవి తిమ్మప్ప ,ఈనాడు నబి రసూల్,ఈనాడు ఓబుళపతి , ఆంధ్రప్రభ నాగరాజు ,విశాలాంధ్ర వెంకట్, ఆంధ్రప్రభ బాబురావు, ఆంధ్రప్రభ ఆనంద్, టీవీ9 రమేష్ రెడ్డి ,ఈటీవీ శివారెడ్డి, సివిఆర్ లక్ష్మీనారాయణ ,ప్రైమ్9 న్యూస్ శ్రీకాంత్, రాజ్ న్యూస్ చంద్రశేఖర్ ,99 న్యూస్ ఆలీ, అనంత న్యూస్ గంగాధర్ ,ఐ న్యూస్ దాదా, మహా న్యూస్ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img