Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్‌ సేవలు మరువలేనివి

సబ్‌ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండలో విశ్రాంతి ఉద్యోగులు అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని ఉరవకొండ సబ్‌ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు అన్నారు. శనివారం ఉరవకొండ లోని విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్‌ భవన్లో అసోసియేషన్‌ అధ్యక్షులు కే. కిష్టప్ప అధ్యక్షతన విశ్రాంతి ఉద్యోగుల జాతీయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్రబాబు మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగులు అందరూ కూడా ఉరవకొండ పట్టణంలో ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకొని పదవి విరమణ తర్వాత కూడా అందరూ రోజు కలుసుకొని మాట్లాడుకోవడం అభినందనీయమన్నారు. ఉరవకొండ విశ్రాంతి ఉద్యోగులను అన్ని ప్రాంతంలో కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఎస్బిఐ బ్రాంచ్‌ మేనేజర్‌ రాజేష్‌ మాట్లాడుతూ. ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రజాసేవ చేసి పదవి విరమణ తర్వాత కూడా సమాజాభివృద్ధికి పాటుపడాలని ఉద్దేశంతో అసోసియేషన్‌ ఏర్పాటు చేసుకొని సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించుకోవడం హర్షనీయమన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్‌ అధ్యక్షులు కిష్టప్ప మాట్లాడుతూ విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నామని దీనికి ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలన్నారు. అనంతరం 70 సంవత్సరాలు వయసు మీరు విశ్రాంతి ఉద్యోగులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి ఉద్యోగంలో ఉండగా వారు చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్‌ నాయకులు వెంకటస్వామి, చెన్నా రాయుడ, పోతప్ప,ఓబులప్ప, డాక్టర్‌ నారాయణస్వామి,వీరితోపాటు పెద్ద సంఖ్యలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. అంతకుముందు విశ్రాంతి ఉద్యోగుల పథకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img