Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వెంకట రమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయం..

డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో గల పరమ సంస్థానం ట్రస్ట్ బోర్డ్, వెంకటరమణాచార్య గురువు చారిటబుల్ ట్రస్టు సేవలు అభినందనీయమని, అనన్యమైనవని డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణచార్య గురువు యొక్క పదకొండవ ఆరాధన మహోత్సవాల కార్యక్రమానికి మోతిలాల్ నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. తదుపరి వారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఇటువంటి సేవలు చేయడం పేదలకు వరంగా మారిందని వారు తెలిపారు. అనంతరం యోగి ముక్తేశ్వరి మాతాజీ మాట్లాడుతూ ఈ ఆరాధన మహోత్సవాలు ఈనెల 23వ తేదీ నుండి 30 ఒకటవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ట్రస్టు ద్వారా జరిగే కార్యక్రమాలు దాతలు, ట్రస్ట్ సహాయ సహకారములతో నిర్వహించబడుతున్నాయని తెలిపారు. ఇప్పటివరకు అనగా మొదటి రోజు నుంచి ఇప్పటివరకు గురుపూజ, ప్రభుత్వ ఆసుపత్రిలో బ్రెడ్లు పండ్లు పంపిణీ, సంజీవపురం ఆశ్రమంలో వస్త్ర దానం, గురువుల ఉపన్యాసం, 109 మంది దంపతులచే కలశములతో కలశ పూజలు, మహా యజ్ఞం, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందన్నారు. 8వ రోజు కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణమునందు అన్నదాన కార్యక్రమాన్ని డిపో మేనేజర్ మోతిలాల్ నాయక్ చేతులు మీదుగా పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి వేలాదిమంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వైస్ చైర్మన్ అశోక్ కుమార్, కార్యదర్శి రామాంజనేయ చారి, ఉప కార్యదర్శి మల్లికార్జున, కోశాధికారి నాగభూషణం వారి శిష్య బృందం పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img