Friday, April 19, 2024
Friday, April 19, 2024

వెట్టి చాకిరి నిర్మూలన చట్టంపై విద్యార్థులకు అవగాహన…

విశాలాంధ్ర-గుంతకల్లు : వెట్టి చాకిరి నిర్మూలన చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గురువారం పొట్టి శ్రీరాములు కూడలి వద్ద సీఐ లు రామసుబ్బయ్య,గణేష్ నిర్వహించారు. ముఖ్య అతిథులు గుంతకల్లు తాసిల్దార్ బి.రాము, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న,గుంతకల్లు డిఎస్పి నరసింగప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాహశీల్దార్ బి.రాము మాట్లాడుతూ నిరుపేదలు పెట్టి చాకిరి పనిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న వారిని రక్షించాలన్నారు.ఎలాంటి నేరాలు జరగకుండా నిర్మూలించేందుకు అందరితో కలిసి అవగాహన కల్పించాలన్నారు. వెట్టి చాకిరి నిర్మూలల చట్టం అమలు ద్వారా ఆంధ్రప్రదేశ్ను వెట్టి చాకిరి రహిత రాష్ట్రంగా మార్చాలన్నారు.తద్వారా ప్రజలందరూ ఆరోగ్యంగా సంపన్నమైన జీవితం గడపగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్లు పుష్పవతి శ్రీదేవి చైల్డ్ లైన్ సభ్యులు బాలాజి, భాగ్యలక్ష్మి ,టిపిఆర్ మోహన్ ,మెప్మా సెక్షన్ సభ్యులు మధు,మనోప్రియ,ఉపాధ్యాయులు కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img