Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వైద్య ఆరోగ్య శాఖలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వీరబ్బాయి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ వేడుకలను శుక్రవారం జిల్లా కార్యాలయం నుండి సాయి నగర్ అంబేద్కర్ భవన్ మీదుగా నగరవీధుల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న వారు భేటీ బచావో, భేటీ పడావో, ఇండియాకు స్వర్గ బనావో. మరియు ఆడబిడ్డ రక్షించండి, ఆడబిడ్డ మానవజాతికి మూలం అనే నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ… ఈ కార్యక్రమం జిల్లా లో మార్చి 1 వ తేదీ నుండి 8 వ తేదీ వరకు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రశీ లో నిర్వహిస్తామని తెలిపారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధిత చట్టం పుట్టబోయే ఆడపిల్లలకు రక్షణగా నిలుస్తుందని అన్నారు. ఈ చట్టం అనుసరించే విధానంలో మహిళ గర్భిణీ గా ఉన్నప్పుడే ఆడ మగ బేధం లేదనే విషయాన్ని స్థానిక ఆరోగ్య కార్యకర్త మరియు ఆశా కార్యకర్త క్షేత్రస్థాయిలోనే అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా రేపటి మహిళ అయినా ఈనాటి యువతకు అన్ని రంగాల్లోనూ అవకాశాలు ఉన్నాయని అన్నారు. లింగ సమానత్వాన్ని మెరుగ్గా మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని అన్నారు.
డా. యుగంధర్ మాట్లాడుతూ లింగ వివక్షను నిర్మూలిద్దాం, ఆడపిల్లను కాపాడుదాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయని లింగ సమానత్వం మరియు మహిళా సాధికారతను, పురోగతిని సాధించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డా. సుజాత, డెమో భారతి, డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణుగోపాల్, కిరణ్ కుమార్ ,ఆషారాణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img