Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైభవంగా రథసప్తమి వేడుకలు

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలంలో బూదగవి,ఆమిద్యాల, గ్రామాల్లో సూర్య దేవాలయాల్లో రథసప్తమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. బుదగవి గ్రామంలో వెలిసిన సూర్యనారాయణ స్వామి దేవాలయానికి తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు బారులు తీరారు.రథసప్తమిని పురస్కరించుకుని బూదగవిలో స్వామి వారి మూల విరాట్ కు విశేష పూజలు నిర్వహించారు.నవగ్రహ పూజా,అరుణహోమం తదితర పూజల అనంతరం ఉభయ దేవేరులతో సూర్యభగవానుడి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.సూర్యభగవానుడిని దర్శించుకునేందుకు అనంతపురం జిల్లా తో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.దింతో భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి.ప్రపంచంలో దాక్షిణాభి ముఖంగా ఉన్న ఏకైక సూర్య భగవానుడి ఆలయం కావడం..స్వామివారిని దర్శించుకుంటే ఆపమృత్యు దోషం పోతుందని భక్తుల నమ్మకం.అందుకే ప్రతి ఏటా రథసప్తమి రోజు వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ఆమిద్యాల గ్రామంలో వెలిసిన సూర్య దేవాలయంలోనూ అలాగే పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయాలలో కూడా రథసప్తమి వేడుకలు వైభవంగా కన్నుల పండుగగా జరిగాయి బుదగవి సూర్య దేవాలయాన్ని అనంతపురం జడ్పీ చైర్మన్ బోయ గిరిజన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ఆ పార్టీ యువజన నాయకులు భీమిరెడ్డి, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామాంజనేయులు, జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సతీమణి భువనేశ్వరి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ అంగదాల కృష్ణయ్య, వైస్ ఎంపీపీ నరసింహులు, సర్పంచ్ లక్ష్మీదేవి, ఉత్సవ కమిటీ సభ్యులు ధనుంజయ, ఉండ బండ ఆలయ ఈవో రమేష్ బాబు, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామ తులసి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img