Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

వైభవంగా సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన

విశాలాంధ్ర -బొమ్మనహల్: మండలంలోని నెమకల్లు గ్రామంలో నీ పాఠశాల ఆవరణం లో శుక్రవారం వేద పండితులు ఆధ్వర్యంలో వైభవంగా సరస్వతి విగ్రహా ప్రతిష్టాపన చేశారు గ్రామ సర్పంచ్ పరమేశ్వర సొంత నిధులతో సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన విద్యార్థులకు భోజనం కార్యక్రమం నిర్వహించారు చదువుల తల్లి సరస్వతి విగ్రహ ని ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద నుండి విద్యార్థులు ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఊరేగింపుతో విగ్రహాన్ని పాఠశాల వద్దకు తీసుకువచ్చి పాఠశాల ఆవరణములో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించి ప్రతిష్ట చేశారు అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తో పాటు పాఠశాల అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని విద్యార్థులు బాగా చదువుకుని గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తిమ్మప్ప ఉపాధ్యాయులు అన్నదాన కమిటీ చైర్మన్ రామాంజనేయులు మాజీ ఆలయ ధర్మకర్త వన్నూరు స్వామి తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img