Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వైభవంగా సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ పట్టణంలో స్థానిక సుబ్రమణ్యేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగ జరిగింది. సుబ్రమణ్యేశ్వర స్వామి షష్టి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామి వారి మూల విరాట్‌ కు విశేష అలంకరణ చేశారు. మధ్యాహ్నం అభిజిత్‌ లగ్నం నందు శ్రీవల్లి,దేవసేన సహిత సుబ్రమణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కృష్ణయ్య, చైర్మన్‌ కరిబసప్ప,సభ్యులు విజయలక్ష్మి, సుబ్బలక్ష్మి, బండారువేమన్న, శంకరయ్య, ఆలయ అర్చకులు దివాకర్‌ శర్మ, నాగరాజు శర్మ, కేకే ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img