Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం హక్కులపై దాడి చేస్తుంది…

జగన్ ఏకచక్రాతిపదిగా ఉండేందుకే ఈ జీవో

ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు లేవు

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్…

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రతిపక్షాలు ఏమీ లేకుండా జగన్ ఏక చక్రాధిపతిగా ఉండేందుకే ఈ జీవో ఒకటని ప్రజా సమస్యలపై గొంతు ఎత్తకుండా ప్రజాస్వామ్యం హక్కులపై దాడి చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ విమర్శించారు సోమవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో రాజ్యాంగ ప్రజాస్వామిక హక్కులు జీవో నెంబర్ ఒకటి పర్యవసనాలు సెమినార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డి.జగదీష్ ,శంకరనంద డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్కే నాయుడు, టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణారెడ్డి, టిడిపి రాష్ట్ర నాయకులు వెంకట శివుడు యాదవ్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పట్టణ కార్యదర్శి చిన్న,సీపీఐ పట్టణ కార్యదర్శి గోపీనాథ్,ఏఐటియుసి మండల కార్యదర్శి ఈశ్వరయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏఐటియుసి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా డి.జగదీష్ మాట్లాడుతూ జీవో ఒకటి చట్టం అమలుపై ఒక సారాంశం ఉంది అది ఆయన 13 ఆర్థిక నేరాల్లో ముద్దాయి జీవో నెంబర్ ఒకటి కాబట్టి ఈ జీవోని అమలు పరచారన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం సంబందం ఉన్న రిలయన్స్ సంస్థలను కూడా ఆ పార్టి ధ్వంసం చేయించిందని తెలిపారు. టిడిపి, సిపిఐ, సిపిఎం,సీపీఐ ఎం ఎల్ , ప్రజా సంఘాలు ఇలాంటి ధ్వంసాలు చేయలేదన్నారు. అంతేకాకుండా ఆ పార్టీకి ఇంకొక చరిత్ర ఉందన్నారు.సాదాసీదా వ్యక్తి వైయస్ వివేకానంద నీ చంపింన ఆ పార్టీ చరిత్రలో ఉందని అన్నారు. అలాంటి పార్టీ ఈరోజు నీతులు చెప్తుందని అన్నారు. వారు మాట్లాడుతున్నది ప్రజలకు అసౌకర్రం కలుగుతుందని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని రోడ్ షో చేయకుడదని సభలు పెట్టకూడదని,దర్నాలు చేయకూడదని ఊరేగింపులు చేయకుడదని దయ్యాలు వేదాలు వర్ణించి నట్లు వైఎస్ ఆర్ పార్టి ఎర్పాటు చేసిన చరిత్ర ఇటువంటీ అరాచక చరిత్రి కలిగిన మీరు రాష్ట్రం ఉన్న ప్రతి పక్షాలు ఎప్పుడైన అలాంటి పనులు చేశార అని ప్రజలకు ఎపుడై ఇబ్బంది కలిగించినాయ అని ప్రశ్నించారు.జీవో 1 ని తీసుకువచ్చాడంటే ఇది కేవలం ఆ ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకం పై ప్రతిపక్షాలను అడ్డుకునేందుకు ఈ జీవో ఒకటిని తెచ్చాడన్నారు.కందుకూరులో,కుప్పంలో చంద్రబాబు వల్ల చనిపోయారని వైసీపీ ఆరోపనలు చేశారు.ఏమయ్య నీకు సిగ్గుందా చంపింది చంధ్రబాబు నాయుడా లా అండార్డర్ ఆయనకు ఉందా ప్రభుత్వంలో ఆయన ఉన్నాడా ఆయన మాజి ముఖ్యమంతి అంతే అన్నారు. ఈ మృతికి కారణం ప్రభుత్వం వైఫల్యమే అని స్పష్టంగా కనబడుతుందన్నారు. ఇలాంటి సంఘటన జరిగిందని నిషేధిస్తారా అని ప్రశ్నించారు. కుంభమేళ సంఘటనలో తొక్కిసలాటలో ఎంతోమంది చనిపోయారన్నారు. ప్రతిపక్షాలు గొంతు ఎత్తకుండా ఇలాంటి జీవోలు తీసుకొచ్చారన్నారు ఎంతకాలం ఈ జీవులతో ఆపుతావని నువ్వు ఏమైనా మోనార్కువ నువ్వేమైనా నియంతవా ఇది ఒక డెమోక్రసీ అని రాజ్యాంగం యొక్క సూత్రాలలో స్వేచ్చ,ప్రజా సమసమస్యలపై ప్రశ్నించే హక్కులు కల్పించిందన్నారు. ఈ జీవో వల్ల ఎవరు మాట్లాడుకోకుండా ఉండేందుకు ఏక చక్రాధిపతిగా ఉండేందుకు ఇది సాధ్యమవుతుందా అని తెలిపారు. ఒక ప్రతిపక్ష పార్టీగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో వేసిందన్నారు.సానుకూలంగా న్యాయస్థానం తీర్పు కూడా ఇచ్చిందన్నారు. మళ్లీ సిగ్గు లేకుండా వైసిపి సుప్రీంకోర్టులో వేసరన్నారు. సుప్రీంకోర్టు నీ వ్యవహారం అంతా హైకోర్టులోనే తేల్చుకో పోమని చెప్పిందన్నారు.వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యం హక్కుల పైన దాడి చేస్తుందన్నారు. ఏ రాష్ట్రంలో ఇలాంటి చట్టాలు తీసుకురాలేదన్నారు. రైతులందరూ ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని రైళ్ళను దిగ్బంధం చేసి పెద్ద ఎత్తున సంత్సరం పాటు ధర్నాలు చేపట్టారు. సంవత్సరం పాటు ఢిల్లీలో ధర్నా లో మృతి చెందారు అయితే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇలాంటి చట్టం తీసుకొచ్చిందా అని ప్రశ్నించారు. నరేంద్ర మోడీ లాంటివాడు నల్ల చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించాడన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఎన్నో ధర్నాలు,ఆందోళనలు, పాదయాత్ర చేసినప్పుడు ఇలాంటి చట్టాలు విధించలేదన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు అబ్దుల్ వహాబ్, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎస్ఎండి గౌస్ ,సిపిఐ మండల కార్యదర్శి రాము రాయల్, సిపిఐ మండల సహాయ కార్యదర్శి రామాంజనేయులు, మహిళా సమైక్య నియోజవర్గం కార్యదర్శి రామాంజినమ్మ ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దేవేంద్ర ,సిపిఐ నాయకులు మురళీకృష్ణ ,మల్లయ్య ,పుల్లయ్య ,నరసయ్య ,ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గం ఆర్గనైజింగ్ కార్యదర్శి వినోద్ కుమార్, జై భీమ్ పార్టీ రాజేష్ ,ఎమ్మార్పీఎస్ నాయకులు నరసింహులు ,సంచార జాతుల రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు, గాలి మల్లికార్జున హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img