Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వ్యక్తిగత పరిశుభ్రత ఎంతో అవసరం

నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండెంజో మాత్రలు అందజేసిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వీరబ్బాయి అధ్యక్షతన మరియు జడ్పీ సీఈవో భాస్కర్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సాయిరాం వారి ఆధ్వర్యంలో స్థానిక కె .ఎస్. ఆర్ జూనియర్ కళాశాలలో స్థానిక విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించి నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఈవో భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ నులి పురుగుల నివారణ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆరోగ్యవంతులవ్వాలని పేర్కొన్నారు. డి ఎం అండ్ హెచ్ ఒ డా.వీరబ్బాయ్ మాట్లాడుతూ… విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భోజనానికి ముందు, మరియు మల మూత్ర విసర్జన తరువాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మంగళవారం కళాశాలకు హాజరవని పిల్లలకు మార్చి 18వ తేదీన జరిగే మాప్ అప్ రోజున వేస్తారని పేర్కొన్నారు. మాత్ర తీసుకున్న తర్వాత వికారం కొద్దిగా కడుపునొప్పి, వాంతులు విరోచనాలు, నీరసం వంటివి కలిగే అవకాశం ఉందని అట్టివారికి నులి పురుగుల సంక్రమణ ఉన్నట్టుగా గ్రహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో
కె. భాస్కర్ రెడ్డి, జడ్పీ సీఈఓ
ఎం . సాయి రామ్ డి ఈ ఒ , మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. గంగాధర్ రెడ్డి, వనజాక్షి , కిరణ్మయి హెడ్ మాస్టర్, డా.నారాయణ స్వామి, పి ఒ – ఎన్ సి డి డ ఆర్ బి ఎస్ కె మేనేజర్ రజిత,
లోకేశ్వర్ రెడ్డి, డా. తేజస్విని
వెంకట రమణ నాయక్,
వెంకట స్వామి ఎం ఈ ఒ,డిప్యూటీ డెమో త్యాగరాజు, వేణు, కిరణ్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img