Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వ్యాయామ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

విశాలాంధ్ర..ఉరవకొండ : ఆ ప్రభుత్వ పాఠశాల యందు క్రీడా మైదానం తో పాటు కనీస సౌకర్యాలు కూడా లేవు అయినప్పటికీ ఆ పాఠశాలలో పనిచేస్తున్న ప్రభాకర్‌ అనే వ్యాయామ ఉపాధ్యాయుడు పాఠశాలలో చదివే విద్యార్థులను వివిధ క్రీడలలో రాష్ట్రస్థాయికి ఎదిగేలా తీర్చిదిద్దాడు. ఇటీవల జరిగిన ఖో ఖో రాష్ట్రస్థాయి పోటీలకు సీనియర్‌ మరియు జూనియర్‌ విభాగాలలో ఏకంగా 16 మంది ఈ పాఠశాల విద్యార్థులే ఎంపిక కావడం విశేషం .ఈ క్రీడలలోనే కాకుండా వాలీబాల్‌, త్రో బాల్‌ సెపక్తక్రా క్రీడలలో కూడా జిల్లా స్థాయి జట్టుకు క్రీడాకారులును ఎంపికయ్యలా వ్యాయామ ఉపాధ్యాయుడు కృషి చేశారు ఉరవకొండ మండలం మోపిడి ప్రభుత్వ హైస్కూల్లో పనిచేస్తున్న ఈయన వల్ల తమ పాఠశాలకు మరియు తమ గ్రామానికి కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారని వ్యాయామ ఉపాధ్యాయుడు యొక్క కృషిని ప్రశంసిస్తూ మంగళవారం పాఠశాలలో ఆయనను ఘనంగా సన్మానించారు. మరింత మంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్ది జాతీయ స్థాయికి ఎదిగేలా ఉపాధ్యాయుడు కృషి చేయాలని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు శేషగిరి, గ్రామ పెద్దలు వెంకటేశులు జగన్నాథ్‌, రామ్మూర్తి ఆంజనేయులు, రవి వీరితోపాటు పాఠశాల సిబ్బంది విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img