Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

శిక్షణా తరగతులు అభివృద్ధి ప్రణాళికకు ఉపయోగకరం. ఎంపీడీవో మమతా దేవి


విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల అభివృద్ధి ప్రణాళిక కు శిక్షణా తరగతులు ఉపయోగ కరంగా ఉంటాయని ఇన్చార్జ్‌ ఎంపీడీవో మమతా దేవి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులకు ఎంపీపీ రమాదేవి అధ్యక్షతన రెండు రోజులపాటు అవగాహన సదస్సులను నిర్వహించారు. తదుపరి మమతా దేవి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయటానికి తీసుకోవలసిన పద్ధతులు, అమలుపరచాల్సిన అంశాలపై తగిన సూచనలను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం2023-24 వ సంవత్సరానికి సంబంధించి వచ్చే ఆదాయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు ,సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పంచాయతీ కార్యాలయంలో అభివృద్ధి ప్రణాళికలను తయారుచేసి ఎప్పటికప్పుడు కంప్యూటర్లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి పంచాయతీకి వచ్చే నిధులను, విధిగా అభివృద్ధికి మాత్రమే ఉపయోగించినప్పుడే ఆ పంచాయితీకి మంచి పేరు వస్తుందని తెలిపారు. ప్రొజెక్టర్‌ ద్వారా అన్ని విభాగాలలో గల అంశాలను వివరించామనీ తెలిపారు. పేదరికం లేని మెరుగైన సమాజం, పరిశుభ్రమైన గ్రామం, ఆరోగ్యం, ఆనందకరమైన సమాజం, నీటి సమృద్ధి, సుపరిపాలన తదితర వాటిలో ముందంజలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఏలుకుంట్ల, నేలకోట, దర్శనమల, తుమ్మల, పోతుల నాగేపల్లి, మల్లా కాలువ సచివాలయ సిబ్బంది, గ్రామ పంచాయితీ అధికారులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పరిపాలన అధికారి రామచంద్ర, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ, మండల స్థాయి వివిధ ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img