Friday, April 19, 2024
Friday, April 19, 2024

శిశు మరణాలపై సమీక్ష

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. యుగంధర్ అధ్యక్షతన గురువారం శిశు మరణాల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా లో జరిగిన ఐదు శిశు మరణాల మీద సమీక్ష జరిపి సంభందిత వైద్యాధికారులు తయారు చేసిన నివేదిక లను పరిశీలించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…క్షేత్ర స్థాయిలో గర్భవతులలో సాధారణంగా కనిపించే రక్త హీనత, అధిక రక్త పోటు సమస్య ల ను త్వరగా గుర్తించి తగు సూచనలు సంభందిత వైద్యాధికారులు ఎప్పటి కప్పుడు అందించడం ద్వారా శిశు మరణాలను అరికట్టవచ్చు అన్నారు. వైద్య సిబ్బంది గర్భవతులకు మరియు బాలింత ల కు మెరుగైన సేవలు అందిస్తే జిల్లా లో శిశు మరణాలు సంభవించవన్నారు.ముఖ్యంగా సంభందిత వైద్యాధికారులు తల్లులకు తగు ఆరోగ్య సూత్రాలు మరియు సూచనలు ఎప్పటి కప్పుడు తెలపాన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సూచనల ప్రకారం సురక్షిత మాతృత్వం, నవజాత శిశువు సంరక్షణ మన అందరి బాధ్యత అని ఏ తల్లీ జన్మనిస్తూ మరణించ కూడదు, ఏ బిడ్డ జన్మిస్తూ మరణించ కూడదు అని అన్నారు. బిడ్డ తల్లులు పౌష్ఠికాహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా.దినకర్, డా. శంకర్ నారాయణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు, డి పి హెచ్ ఎన్ ఒ లు వీరమ్మ, ఇందిర, సుబ్రమణ్యం, లక్ష్మన్న లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img