Friday, April 19, 2024
Friday, April 19, 2024

శ్రీ వాణి డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో ఘనంగా మ్యాథమెటిక్స్‌ డే

శ్రీనివాసన్‌ రామానుజన్‌ జయంతి వేడుకలు
విశాలాంధ్ర ` అనంతపురం వైద్యం : శ్రీ వాణి డిగ్రీ పీజీ కళాశాలలో మ్యాథమెటిక్స్‌ డిపార్ట్మెంట్‌ శ్రీనివాస రామానుజన్‌ జన్మదిన సందర్భంగా మ్యాథమెటిక్స్‌ డే ని గురువారం ఘనంగా నిర్వహించారు. మ్యాథమెటిక్స్‌ విభాగాధిపతి ఎం అనూష అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగాఎస్కేయూ రిటైర్డ్‌ మాథెమాటిక్స్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ శివప్రసాద్‌ , ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కే హెచ్‌ వనజమ్మ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ వైవి నాగరాణి పాల్గొన్నారు. ముందుగా డాక్టర్‌ శ్రీనివాసన్‌ రామానుజన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ్యాథమెటిక్స్‌ ప్రతి ఒక్కరికి అవసరమని, ప్రతి ఒక్క చోట ఉపయోగపడే సబ్జెక్ట్‌ అని పేర్కొన్నారు . మ్యాథమెటిక్స్‌ తో అనుబంధం ఉన్న ఖగోళ శాస్త్రము గణాంక శాస్త్రం ,వేద గణితము ఇవన్నీ మన భారతదేశంలోనే పుట్టాయని పేర్కొన్నారు. మ్యాథమెటిక్స్‌ లో మార్కులు బాగా సంపాదించిన విద్యార్థులకు ఎక్కడైనా రాణించగలుగుతారని వాళ్లకు ఏ సమస్య అయినా పరిష్కరించే నైపుణ్యాలు ఉంటాయని పేర్కొన్నారు. విద్యార్థులు సాధన ద్వారా మాత్రమే మ్యాథమెటిక్స్‌ ను నేర్చుకోగలుగుతారని సంపూర్ణ ఉత్తీర్ణత శాతాన్ని సాధించగలుగుతారని తెలిపారు. మాథెమాటిక్స్‌ విద్యార్థులకు వివిధ సూచనలు చేస్తూ ముఖ్యంగా పాత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా అధిక మార్కులను పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్‌ అధ్యాపకుడు సి.కిరణ కుమార్‌,మాధ్స్‌ అధ్యాపకురాలు ఆర్‌.ఎస్‌. కావ్య, జి ప్రత్యూష, టీ స్వర్ణలత, సి రవికుమార్‌ ఇతర అధ్యాపక బృందం విద్యార్థినిలు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు .

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img