Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సంక్షేమ సారథి ప్రభుత్వాన్ని దీవించడానికి ప్రజల స్పందన అమోఘం

విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ పట్టణము నందు శనివారం ఎమ్మెల్యే మాల గుండ్ల శంకర్ నారాయణ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న నువ్వే మా నమ్మకం గడపగడపకు కార్యక్రమం జగనన్న మా భరోసా జరుగుతున్న కార్యక్రమాలపై మాట్లాడారు ఈనెల 7వ తేదీ నుంచి గృహసారథులు మరియు సచివాలయ కన్వీనర్లు స్థానిక సర్పంచులు ఎంపీటీసీలు వైఎస్ఆర్సిపి నాయకులు గడపగడపకు వెళ్లి గత నాలుగు సంవత్సరాల నుంచి ఆ గడపకు చేరిన సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకొని అలాగే వారి యొక్క అభిప్రాయాలను తెలుసుకొని వారి యొక్క సమాచారాన్ని సంక్షిప్త సందేశం ద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి చేరు విధంగా జగనన్న సైనికులు చాలా బాగా పనిచేస్తున్నారని గ్రామస్థాయిలో ఇంటింటికి స్టిక్కర్లు వేయడం సెల్ఫోన్లకు స్టిక్కర్లు మరియు సంక్షేమ కార్యక్రమాలు వివరించడం చాలా బాగా ప్రజాస్వాందన వచ్చిందని శంకర్ నారాయణ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు నేరుగా లబ్ధి పొందడం మరియు లబ్ధి పొందిన వారు సంక్షేమ సారధిని సంక్షేమ ప్రభుత్వాన్ని దీవించాలని కోరుకుంటూ ఈనెల ఏడవ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు ఎటువంటి ప్రలోభాలు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సచివాలయాల ద్వారా ఆర్థిక భరోసా లభిస్తున్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎక్కడా మచ్చ లేకుండా అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకే చేరుతున్నందున ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పట్ల తమ యొక్క వ్యక్తిగతంగా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గీత రామ్మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, కన్వీనర్ బాబు, దుద్దే బండ సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి,పట్టణ కన్వీనర్ నరసింహ, కౌన్సిలర్లు మారుతి, వెంకట్రామిరెడ్డి, భాస్కర్ నాయక్, ప్రసాద్ రెడ్డి, అగ్రి చైర్మన్ కొండలరాయుడు, అమ్మవారి పల్లి ప్రసాద్ రెడ్డి, భయపరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img