Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంస్కృతీ, సంప్రదాయాల సంరక్షణ మాతృభాషతోనే సుసాధ్యం…

వైస్ ప్రిన్సిపాల్ జీవన్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం : సంస్కృతి సాంప్రదాయాల సంరక్షణ కేవలం మాతృభాషతోనే సుశాధ్యమని వైస్ ప్రిన్సిపాల్.. జీవన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు విభాగం షమీవుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించుకున్నారు.ఈ సభకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. టి. జీవన్ కుమార్ అధ్యక్షత వహించి అనంతరం. విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఁప్రతి విద్యార్థి తమ మాతృభాషని పరిరక్షించుకున్నప్పుడే మన సంస్కృతి, సంప్రదాయాలు కాపాడబడతాయని, మన మాతృభాష మన జీవన విధానానికి మూలాధారం అని పేర్కొన్నారు. మాతృభాషను కాపాడుకొంటూ తక్కిన భాషల్ని నేర్చుకోవడం ద్వారా శాశీయదృక్పథం పెంపొందుతుందని పేర్కొన్నారు. మిగిలిన వక్తలు తమ మాతృభాష పట్ల విద్యార్థులందరూ ఆశక్తి పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యం. రాబియాబేగం, డా. ఎస్. చిట్టెమ్మ, డా. ఎన్. షమీఉల్లా, ఎస్. పావని, డా. బి. గోపాల్ నాయక్, ఎ. కిరణ్ కుమార్, యం. భువనేశ్వరి, యం. పుష్పావతి, జి.గౌతమి, టి. రాంమోహన్రెడ్డి, కె.వై. స్వామి, తదితర అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img