Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సకాలంలో స్పందించిన వన్ టౌన్ పోలీసులు

విశాలాంధ్ర- ధర్మవరం : పట్టణంలోని ఎర్రగుంట రోడ్ ఎస్ఎస్ బార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఐచర్ లారీ(కే. ఏ.51..ఏ జి 7836) వరి పొట్టుతో నార్పల నుండి బాగేపల్లి కి వెళుతుండగా, ప్రమాదవశాత్తు తొలుత పొగరావడం, అనంతరం మంటలు రావడం జరిగింది. ఇంతలో వన్ టౌన్ సీఐ సుబ్రహ్మణ్యం తన సిబ్బందితో నైట్ బీట్ చెకింగ్ వెళ్లే సమయంలో ఈ దృశ్యం కనబడగా, సకాలంలో వారు స్పందించి, అక్కడే నీటి కుళాయిలో నీరు వస్తున్న వాటిని బకెట్లలో స్థానికులతో లారీపైన పోయించారు. తదుపరి ఫైరింజనుకు సమాచారం ఇచ్చి మంటను పూర్తి అదుపులోనికి తెచ్చారు. లారీ బాగేపల్లి కి చెందినదిగా సిఐ తెలిపారు. వరి పొట్టు ఇంజన్లోకి కొద్దిగా పోవడం, ఇంజన్ హీట్కు కొన్ని డీజిల్ చుక్కలు కూడా కలవడంతో మంటలు రావడం జరిగిందని వారు తెలిపారు. సకాలంలో డ్రైవర్ హరీష్ ను కిందకు దింపి, మంటలను పూర్తిగా అదుపు చేయడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా లారీ యజమాని, డ్రైవర్ కూడా వన్ టౌన్ సిఐ కు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. సకాలంలో వన్ టౌన్ పోలీసులు స్పందించడంతో ఓవైపు లారీ దగ్ధం కాకుండా ఒక ప్రాణాన్ని కూడా కాపాడడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img