Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

సమస్యలను పరిష్కరించండి

పంచాయతీ సమావేశంలో వార్డు సభ్యులు విజ్ఞప్తి
విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో అనేక వార్డులలో సమస్యలు నెలకొన్నాయని వాటిని పరిష్కరించాలని పలువురు వార్డు సభ్యులు విజ్ఞప్తి చేశారు శనివారం ఉరవకొండ మేజర్‌ గ్రామపంచాయతీ సమావేశం సర్పంచ్‌ లలిత అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా వార్డు సభ్యులు రామాంజనేయులు, మాధవి మాట్లాడుతూ తమ వార్డులలో గత అనేక రోజుల క్రితం బోర్లు వేశారని వాటికి సంబంధించిన మోటర్లు సిస్టం ఏర్పాటు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించాలనికోరారు. విద్యుత్‌ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి టెండర్‌ నోటిఫికేషన్‌ ఇవ్వకుండా రహస్యంగా కొంతమందికి మాత్రమే టెండర్లు వేసుకునే కి అవకాశం ఇవ్వడం పట్ల పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు ఉరవకొండ పట్టణంలోని అనేక వార్డులలో వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని తక్షణమే విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు గ్రామపంచాయతీలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు విషయంలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ప్రతి విషయాన్ని కూడా సభ్యులకు తెలియజేయాలని కోరారు అనంతరం సర్పంచ్‌ లలితమ్మ మాట్లాడుతూ వార్డు సభ్యులు అడిగిన సమస్యలన్నీ కూడా న్యాయమైనవేనని వాటన్నిటిని కూడా త్వరలో పరిష్కరిస్తామన్నారు పంచాయతీ యొక్క నిధులు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టేటప్పుడు పారదర్శకంగానే వ్యాహవరిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్‌ వన్నప్ప, గ్రామ కార్యదర్శి గౌస్‌ సాహెబ్‌ వార్డు సభ్యులు పలువురు ఎంపీటీసీ సభ్యులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img