Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమస్యలు పరిష్కరించండి కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన మాజీ ఎమ్మెల్యే

విశాలాంధ్ర-ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో నెలకొన్న,పెండింగులో ఉన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి జిల్లా కలెక్టర్ గౌతమిని కోరారు.గురువారం కలెక్టర్ ఛాంబర్ లో ఆమెను కలిసిన పలు అంశాలపై చర్చించారు. అందుకు సంబంధించిన వినతిపత్రాలు అందించారు. ఉరవకొండ పట్టణంలో 600 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టు కేసులు ఆలస్యం జరుగుతోందని ఈ సమస్య తక్షణ పరిష్కరించాలన్నారు హెచ్చెల్సీ నుండి పిఎబిఆర్ కు వెళ్లే లింక్ కెనాల్ శిథిలావస్థకు చేరుకున్నదని తక్షణమే ఆధునికీకరణ పనులు చేపట్టాలని కోరారు. ఉరవకొండ పట్టణంలో త్రాగునీటి ఎద్దడి తీర్చేందుకు ఉదిరిపికొండ పైపులైను పనులు వెంటనే పనులు ప్రారంభించాలని అదేవిధంగా పట్టణంలో ఒక అదనపు సంపు నిర్మాణం చేపట్టాలని కోరారు. నియోజకవర్గంలోని వజ్రకరూరు, బెలుగుప్ప, కూడేరు మండలాల్లో అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు సాగు పట్టాలు వెంటనే మంజూరు చేయాలని రాకెట్ల-ఆమిద్యాల లిఫ్ట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పరిహారం మంజూరు చేయాలన్నారు. ఆమిద్యాల, కమ్మూరు, పి.నారాయణపురం, మరుట్ల ఎం ఏం హళ్లి గ్రామాల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు
కరుట్లపల్లి చెరువును ఆధునికరణ చేయాలని కౌకుంట్ల, ఆమిద్యాల, రూప్లానాయక్ తాండా (ఎస్టీ), చాబాల గ్రామాల్లో కూడా భూమిని సేకరించి అర్హులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలన్నారు. వీటిపై స్పందించిన జిల్లా కలెక్టర్ గౌతమి వెంటనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే విలేకరులకు తెలిపారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img