Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సర్వ మానవాళికి ముక్తి జీవన్ముక్తి ప్రసాదించిన రోజుగా శివరాత్రి పండుగ..

విశాలాంధ్ర-గుంతకల్లు : మహా శివరాత్రి పండుగ రోజు శివుని అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం ప్రజపిత బ్రహ్మ కుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఉదయం జరిగిన కార్య్రమానికి ముఖ్య అతిధి గా గుంతకల్ రెవెన్యూ డివిజన్ అధికారి రవీంద్ర శివ ధ్వజ పతాక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్ డి ఓ రవీంధ్ర మాట్లాడుతూ మనుషుల లోని చెడు గుణాలు పరివర్తన చేసుకుని దైవీ గుణాల ధారణ కోసం బ్రహ్మ కుమారీ ఆశ్రమం లో ఇవ్వ బడుతున్న ఆధ్యాత్మిక శిక్షణ ప్రతి ఒక్కరూ ఆచరించ వలసిన అవసరం ఉందని అన్నారు. బి.కె. శకుంతల మాట్లాడుతూ కలియుగ అంత సమయంలో యావత్ ప్రపంచం అజ్ఞాన అంధకారం లో ఉండి అంతు లేని రోగాలు, దుఃఖము అశాంతి ప్రబలినపుడు శివుడు భూమి పై అవతరించి సర్వ మానవాళికి ముక్తి జీవన్ముక్తి ని ప్రసాదించిన రోజునే మనం శివ రాత్రి పండుగ గా అచరిస్తున్నామని పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం పంచ శివ లింగాల మెరవణి ప్రారంభించారు. పట్టణ వీధుల గుండా శాంతి యాత్రను బ్రహ్మ కుమారీలు రాజయోగిని శకుంతల,పార్వతి,గిరిజ లు తదితరులు నిర్వహించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img