Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సాహితీ బ్రహ్మోత్సవాలకు తరలిరండి

సన్నాహక సమావేశంలో మధుబాల పిలుపు
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం: శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో తిరుపతిలో నిర్వహించనున్న ప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలకుఁ కవులు, కళాకారులు తరలిరావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్ పర్సన్ నైనార్ మధుబాల పిలుపునిచ్చారు.
శ్రీశ్రీ కళావేదిక, చేజెర్ల ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో, ఏప్రిల్‌ 9 – 10 – 11 తేదీల్లో 48 గంటల వరల్డ్ రికార్డ్ కార్యక్రమం మహతి కళాక్షేత్రంలో వుంటుందన్నారు. సోమవారం ఁప్రపంచ తెలుగు సాహితీ బ్రహ్మోత్సవాలుఁ సన్నాహక సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
తిరుపతి లోని ప్రథమశ్రేణి శాఖా గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశానికి శ్రీశ్రీ కళావేదిక ఏపి రాష్ట్ర అధ్యక్షులు, సాహిత్య బ్రహ్మోత్సవ ప్రోగ్రామ్ కన్వీనర్ గుత్తా హరిసర్వోత్తమ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్త, ఆహ్వానకమిటీ అధ్యక్షుడు డా. వి.ఆర్. రాసాని, సంస్థ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రొడ్డ, ప్రధాన కార్యదర్శి అరవ జయపాల్, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంజాం భ్రమరాంబ, ప్రముఖ కవి, సీనియర్ జర్నలిస్ట్ కొత్వాలు అమరేంద్ర, జిల్లా యువజన కమిటీ అధ్యక్షుడు పాటూరి నవీన్, ప్రధాన కార్యదర్శి ఎన్. జగదీష్, కార్యదర్శులు ఎం.వి. సుబ్బరాజు, ఆర్. రుద్ర, టి. ముత్యాలసాయి, కవి జి. సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ, తిరుపతిలో అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం నిర్వహించే బృహత్తర ప్రయత్నం అభినందనీయమన్నారు. దాదాపు 1500 మంది కవులు, కళాకారులు నమోదు చేసుకోవడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img