Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిద్ధ ఆయుర్వేద యోగ ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి…

సేవా భారతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని చెలిమి వద్ద గల సరస్వతి విద్యా మందిరం లో ఈనెల 26వ తేదీ ఆదివారం ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉచిత సిద్ధ ఆయుర్వేద యోగ వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు సేవా భారతి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతినిధులు తిరుమలేశు, నరేష్ బాబు, దాసరి రామన్న, రవీంద్ర దాసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ వెన్నెముక నొప్పి, మోకాళ్లు, మెడ, భుజాలు, కీళ్ల నొప్పులు, పక్షవాతం లివర్ గాల్ బ్లాడర్ కిడ్నీ సమస్యలు కడుపునొప్పి వినికిడి లోపం లాంటి సమస్యలకు పరిష్కారం ఉంటుందని తెలిపారు. ప్రముఖ ఆర్తో న్యూరో, ఆక్కుయు ప్రెజర్..వైద్య నిపుణులు గురూజీ జై శ్రీరామ్ ఉచిత వైద్య చికిత్సలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వైద్యం చేయించుకునే వారు తప్పనిసరిగా ఆధార్ కార్డు వెంట తీసుకొని రావాలని తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img